
Jaji patram / జాజిపత్రం
శూర్పకర్ణాయనమః జాజిపత్రం సమర్పయామి
సన్నజాజి అనబడే ఇది మల్లెజాతి లతావృక్షము. సన్నగా పూల మొగ్గలు ఉంటాయి. శాస్త్రీయ నామము (Jasminum Grandiflorum), సంస్కృత నామాలు సంధ్యాపుష్పి (సంధ్యాకాలంలో పుష్పించునది), హృద్యగంథా (హృదయ మనోహర సుగంధము కలిగినది). దీని వేరు తీక్ష విరేచనకారి. శిరో కర్ణ రోగములందు దీని తైలము వాడుతారు. దీని పుష్పముల నుండి సుగంధ తైలము తీస్తారు.