
Jandhyala Pournami
శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు.
ఎవరు ఎన్ని ముడులు ధరించాలి?
బ్రహ్మచారి ఒక ముడి వున్న జంధ్యాన్ని ధరించాలి. గృహస్థుడు మూడుముడులు ధరంచాలి. అయితే కొందరు నాలుగు ముడులు, ఐదు ముడులు కూడా ధరిస్తూంటారు.
– మొదటిపోగు…, వైదిక నిత్యకర్మానుష్ఠానం కోసం,
– రెండవపోగు…,గృహష్థాశ్రమ ధర్మాచరణ కోసం,
– మూడవపోగు…,ఉపాకర్మ రోజున ఉపాంగవస్త్రంగా ధరించడంకోసం,
– నాల్గవపోగు…,తప్పనిసరి పరిస్థితిలో దానం చేయడం కోసం,
– ఐదవపోగు…, పాముకాటుకుగురైన వారి కాలికి కట్టడానికి ఉపయోగంచేవారు.
యఙ్ఞోపవీతధారణ విధి
నూతన యఙ్ఞోపవీతానికి ఐదు చోట్ల కుంకుమ బట్లు పెట్టి, సంకల్పం చెప్పి, షోడశోపచారవిధులతో పూజ చేసి ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ, ఒక్కొక్క ముడిని విడివిడిగా శిరస్సుపైనుంచి
ధరించాలి.
యఙ్ఞోపవీతం పరమం పవిత్రం ా ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్యమగ్య్రం, ప్రతిముంచ శుభ్రం ా యఙ్ఞోపవీతం బలమస్తు తేజ్ణ
‘‘సృష్టికర్త అయిన చతుర్ముఖ ప్రజాపతి సహజసిద్ధంగా ధరించిన యఙ్ఞోపవీతాన్ని, వేదోక్తకర్మాచరణాధికార యోగ్యత కోసం ధరిస్తున్నాను. ఈ బ్రహ్మసూత్రం నాకు ఆయుర్వృధ్ధిని, అగ్రత్వము, నిర్మలత్వము, స్వధర్మాచరణ సామర్థ్యము, తేజ్ణప్రభావమును కలిగించు గాక’’ అని అర్థం. ఈ విధంగా యఙ్ఞోపవీతం ధరించిన తర్వాత, పాత యఙ్ఞోపవీతాన్ని, కొత్త యఙ్ఞోనవీతాన్నికలిపి, వాటి ముడులను గుప్పిట మూసిపట్టుకుని, యథాశక్త్యానుసారం గాయత్రిమంత్రాన్నిఉపాసించాల
పవిత్రవంతం యదిజీర్ణవంతం ా వేదాంతనిత్యం పరబ్రహ్మసత్యమ్
ఆయుష్యమగ్య్రం, ప్రతిముంచ శుభ్రం ా యఙ్ఞోపవీతం విసృజస్తు తేజ్ణ
పాత యఙ్ఞోపవీతాన్ని పాదాలు తగలకుండా కాళ్ళకింద నుంచి తీసి, దానిని తడిప,ి పచ్చని చెట్టుమీదకు విసిరివేయాలి. ఆ తర్వాత యథావిథి నిత్యకర్మలు ఆచరించాలి.
ఇది శ్రావణపౌర్ణమి విశిష్టత.