
అర్కపత్రం | ArkaPatram in Telugu
కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి II
తెలుగులో జిల్లేడు. ఎరుపు, తెలుపు పూవులతో రెండు రకములుగా ఉంటుంది. శ్వేత, రక్తర్కములు. సంస్కృతంలో అలర్క మరియు సూర్యునికి కల అన్ని పేర్లు అర్కమునకు కలవు. శాస్త్రీయ నామము కెలోట్రోపిస్ ప్రోసిరా(Calotropis procera). దీనిని యజ్ఞ సమిధగా వాడతారు. దీని పుష్పములు గణేశ – సూర్య – హనుమత్పూజలలో వాడతారు. అర్కపప్పమాలతో హనుమంతుని పూజిస్తారు.
శ్వేతార్క గణపతి అనగా తెల్ల జిల్లేడు వేరుతో మలచిన వినాయక ప్రతిమను పూజించుట విశేష ఫలప్రదము. దీని ఆకు రసము సర్పవిషహరము. పుష్పములు శ్వాసకోశము లందును, పాలను కైభ్యము (నపుంసకత్వము), ప్రణముల లోను, చిక్కుకుపోయిన ముళ్ళను వెలికి తీయునడిగా వాడతారు.