
Jvaalaatoranotsavam in Telugu / జ్వాలాతోరణోత్సవం
శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తిక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు ‘కార్తిక పూర్ణిమ’.
ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానములతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం- “జ్వాలాతోరణిత్సవం”.
జ్వాలాతోరణోత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తికమాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు శివాలయాల్లో నిర్వహిస్తారు.
కార్తిక పూర్ణిమనాడు సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి, మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి. ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది. దీనికి ‘జ్వాలాతోరణం” అని పేరు.
శివపార్వతులను పల్లకీలో ఉంచి జ్వాలాతోరణం క్రింద తిప్పతారు. ఈ ఉత్సవానికి ‘జ్వాలాతోరణోత్సవం” అనిపేరు.
ఈ జ్వాలాతోరణోత్సవం అమల్లోకి రావడం వెనుక అనేక పురాణాగాధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్ని లయ కారుడైన పరమశివుడు దేవేరి అయిన పర్వవతిదేవితో ముడిపడి ఉన్నాయి.
1. క్షీరసాగరం మధించే సమయంలో
పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలిసి క్షీరసాగరం మధించే సమయంలో ముందుగా క్షీరసముద్రం నుంచి హాలాహలం పుట్టింది. లోకహితం కోసం పరమశివుడు దానిని మింగగా.. ఈ సమయంలో తన భర్తకు ఎటువంటి హాని కలుగకుండా శివుడి కంఠంలోనే హాలాహలం ఉండిపోయి శివుడికి – “గరళకంఠుడు” అనే పేరు ఏర్పడింది.
ఈ విధమైన ఆపద, ఆందోళన సమయంలో “నా భర్తకు ఎటువంటి కీడు కలగకుండా ఈ ఆపద నుంచి బయటపడితే నేను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం క్రింద మూడుసార్ల దూరి వస్తాను” అని మ్రొక్కు కుంది.
అనంతరం, శివుడికి ఎటువంటి ఆపద కలుగక పోవడంతో పార్వతీదేవి శివుడితో కలిసి జ్వాలాతోరణం క్రింద మూడుసార్ల దూరినట్లు. ఆ దినం కార్తికపూర్ణిమ
కావడం వల్ల ఈ రోజునుంచి జ్వాలాతోరణోత్సవం జరపడం ఆచారమైనట్లు కథనం.కాగా, ప్రచారంలో ఉన్న మరోగాథ ప్రకారం.