ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
1. కార్తీక పురాణము – చతుర్థాధ్యాయము
అథ చతుర్థధ్యాయ ప్రారంభః
జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము.
కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు.