కార్తీక పురాణము – పదమూడవ అధ్యాయము | Karthika Puranam Thirteenth Chapter in Telugu

0
1292

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

 

Karthika Puranam Thirteenth Chapter in Telugu

1కార్తీక పురాణము – పదమూడవ అధ్యాయము

వశిష్టుడిట్లు చెప్పెను. జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో విుు. ఆధర్మములన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తీక ధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకు జెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయనియెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను.
కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు. కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రీజప ఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును జెప్పుటకు నాకు శక్యముగాు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్మును ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు. కార్తీకమాసమందు ఉపనయనదానమును జేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును జేయించవలయును. సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను. అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును జెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని యెవ్వనికి సామర్ధ్యము గలదు? పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసినయెడల ఆపుణ్యము ద్రవ్యదాతకు గలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును జేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలో ప్రాప్తి కలిగించినవాడగును. ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ యొకటి గలదు. చెప్పెదను. సావధానుడవై వినుము.
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here