కార్తీక పురాణము – పన్నెండవ అధ్యాయము | Karthika Puranam Twelfth Chapter in Telugu

0
1581

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

 

Karthika Puranam 12th Chapter in Telugu

1కార్తిక పురాణము – పన్నెండవ అధ్యాయము:

వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓరాజా! కార్తీకమాసమందు సోమవారమహాత్మ్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలముగలది.

శనిత్రయోదశికంటె కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటే శుద్ధ పాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశికంటే కార్తీకద్వాదశి అనంతగుణ ఫలప్రదము.

ఇచ్చట అంతిమైకాదశియనగా కార్తీకబహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తీకశుద్ధ ఏకాదశియేయగును.

వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశియనగా కార్తీకశుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీకశుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది.

మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును.

ఏకాదశినాడు ఉపవాసమాచరించి క్ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తిపొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును.

సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు.

పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటె అధికఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది.

కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రమునుండి నిద్ర లేచును గాన ఆద్వాదశి హరిబోధినియనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచరించువాడు యిచ్చట భోగములనుబొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును.

కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానముచేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమునుబొందును. స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగూడ గోదానమాచరించిన యెడల ఆగోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసు కలుగును.

కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమునకుబోవును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని, కంచుపాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును.

కార్తీక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను, యిచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును.

కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీకద్వాదశినాడు పూర్వోక్తానమును జేసినవాడు ాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈవిషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును.

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here