కార్తీక పురాణము – పన్నెండవ అధ్యాయము | Karthika Puranam Twelfth Chapter in Telugu

0
1568

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

 

Karthika Puranam 12th Chapter in Telugu

2కార్తిక పురాణము పన్నెండవ అధ్యాయము కథ

గోదవరి తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ానైనను అనుభవించుటయును లేదు.

వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయు వాడు, పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆకోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణమును తిరిగి పుచ్చుకొనుటకొరకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! నాసొమ్ము నాకిమ్ము అనియడిగెను.

బ్రాహ్మణుడా మాటవిని ఓయీ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను.

ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును.

బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా! బ్రాహ్మణాధమా! నాధనము నాకిప్పుడేయిమ్ము లేనియెడల యీకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను.

ఆకత్తిదెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహముదెబ్బచేత లేడివలె మృతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి క్బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను.

అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులును, నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆవైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి.

రౌరవము రురువనగా మృగవిశేషము. దాని సంబంధమైనది రౌరవము. అనగా రురు మృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును.

ఆవైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను జేయింుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్నిజాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని బూజించుసమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమునుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై “గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత. వైకుంఠ, శ్రీనివాస, శ్రీ వత్స భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే” ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను.

తరువాత ఆవైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలినిబట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి హేనారదా మీరు మాగృహమునకు వచ్చుట చాలా దుర్లభము.

నేను పూర్వమందు యేమిపుణ్యు చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ా! మీకు దాసుడను ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను.

వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా! నామాటను జాగ్రత్తగా వినుము.

కార్తీకద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని, సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపవిశుద్ధికొరకు కార్తీకద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా!

గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత యెట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట యెందుకు?

అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు.

అంత నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరుాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము అయిదు మారులు వృషభమై యుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను.

ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనమురాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మవలన ఆవరుడపుడే మృతుడయ్యెను.

దానిని, మృతినొందిన ఆఅల్లుని బందువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి.

యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును జెప్పెను.

ఇట్లు చెప్పి కూతురుయొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీకసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను.

ఆసాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురభర్త తిరిగి జీవించెను.

తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలమునుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముచేత వానికి జ్ఞానోదయమయ్యెను.

ప్రతి సంవత్సరమందు కార్తీకసోమవారమున సాలగ్రామశిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను.

రౌరవనరకమందున్ వాని తండ్రియు ఆసాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను.

కాబట్టి జనకమహారాజా! కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీ సాలగ్రామదానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు.

కార్తీకమాసమందు సాలగ్రామదానమువలన సమస్త పాపములు నశించును.

ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియము లేదు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాయః

Related Stories

కార్తీక పురాణము – పదమూడవ అధ్యాయము | Karthika Puranam Thirteenth Chapter in Telugu

కార్తీక పురాణము -పదునాల్గవ అధ్యాయము | Karthika Puranam Fourteenth Chapter in Telugu

కార్తీక పురాణము- పదిహేనవ అధ్యాయము | Karthika Puranam Fifteenth Chapter in Telugu

కార్తీక పురాణము – ఏకాదశాధ్యాయము | Karthika Puranam Eleventh Chapter in Telugu

కార్తీక పురాణము – దశమాధ్యాయము | Karthika Puranam Tenth Chapter in Telugu

కార్తిక పురాణము – అష్టమాధ్యాయం | Karthika Puranam Astamadhyayam in Telugu

కార్తీక పురాణము – సప్తమాధ్యాయము | Karthika Puranam Chapter 7 in telugu

Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here