
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
కార్తీక పురాణము – ఇరవై ఎనిమిదవ అధ్యాయము | Karthika Puranam Twenty Eighth Chapter
అంబరీష ఉవాచ:
అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శన చక్రమా! ఆగు ఆగు. నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును యిచ్చెదను.
ఈ బ్రాహ్మణుని విడువుము. లేనియెడల నాతొ యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధముగనుక నాకు దైవమువైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు.
క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు. అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవు.
ఈమాట నాకు తెలియునుగాని అయినాను నా బాహుబలమును జూడుము. విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను.
అట్టియవస్థను జెందక యీతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము.
శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి యిట్లనియె.
సుదర్శనమిట్లు పలికినది. రాజా! నీకు తెలియునా? మధుకైటభులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను యిప్పుడిట్టి అవస్థను నావలన జెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు. అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించబడినది.
క్షత్రియతేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తెజస్సులు నాకు చాలనివైయున్నవి. రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను.
ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని.
కాబట్టి నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను.
జ్వాలలచేత భయంకరమును, దేవదానవులకసహ్యమును నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని యింకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవూ గాని, అన్యులు ఆని నిన్ను జయించలేరు. దైత్యులు చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు. విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తుడై చిరతరసుఖములను బొందును. కలియుగమందీయధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.
ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.
కార్తీక పురాణము – ఇరవై తొమ్మిదవ అధ్యాయము | Karthika Puranam Twenty Ninth Chapter in Telugu