కార్తిక పురాణం లో వివరించిన తులసి మహిమ | Karthika Masam Tulasi Mahima In Telugu.

0
4226
12Karthika Masam Tulasi Mahima
Karthika Masam Tulasi Mahima In Telugu.

Telugu Karthika Masam Tulasi Mahima 

Karthika Masam Tulasi Mahima In Telugu. ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం – ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.
తులసి దళాలతో శివ, కేశవులను అర్చించినవారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. పుష్కరాది తీర్ధాలు గంగాది నదులు, విష్ణు ఆది దేవతలు తులసిలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాళ్ళయినా తులసి మట్టిని పూసుకుని మరణించినట్లయితే వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికీ సత్యం. తులసి ఆకులను ధరించేవారికి పాపాలు అంటవు. తులసివనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు మేలు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here