కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని ఎందుకంటారు? | Bhai Dooj 2020 in Telugu

0
6026
bhagini hasta bhojanam 2020 in telugu
bhagini hasta bhojanam

16th Nov 2020 – భగినీ హస్త భోజనం

Bhagini Hasta Bhojanam – Bhai Dooj 2020 Telugu

Back

1. కార్తీక శుద్ధ విదియ, యమ ద్వితీయ ఎలా అయింది?

భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్తభోజనం విశేషాలు చెప్పబడ్డాయి.

సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున.

యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక – ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు.

ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ తదియ లేదా యమ ద్వితీయ.

చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందుభోజనం పెట్టింది.

సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున “అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి.

అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు” అని అర్ధించింది.

యముడు “తధాస్తు!శుభమస్తు! ” అని అనుగ్రహిస్తూ “అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు” అని అంటాడు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here