కత్తి మహేష్ కు మళ్ళీ చేదు అనుభవం..!

0
1247

కత్తి మహేష్ కు మళ్ళీ చేదు అనుభవం..!

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాురన్న ఆరోపణలతో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ పై ఇదివరకే ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నగర బహిష్కరణ విధించిన విషయం విదితమే. అయితే తన సొంతూరుకు వెళ్లాలనుకున్న కత్తి మహేష్‌ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. స్వగ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం.

చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని తన స్వగ్రామం యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్‌ తెలిపారు. ఈ మేరకు పీలేరు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన ఆయనను పోలీసులు వద్దని వారించారు. లా అండ ఆర్డర్ సమస్య రావొచ్చని పోలీసులు హెచ్చరించారు. అయినా కత్తి మహేష్‌ వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా జీపు ఎక్కించారు పీలేరు పోలీసులు. అక్కడినుంచి ఆయనను బెంగళూరుకు తరలించారు. ఈ ఆర్టికల్ భారత్ టుడే నుంచి సేకరించబడినది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here