ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

0
537
What are the Khairatabad Ganesh 2023 Statue Height & Significance?
What are the Khairatabad Ganesh 2023 Statue Height & Significance?

Khairatabad Ganesh 2023 Statue Height & Significance

1ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం ఎత్తు & ప్రాముఖ్యత

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమిస్తునాడో తెలుసా..?

ప్రతి సంవత్సరం వివిధరూపాల్లో దర్శనం ఇస్తాడు ఖైరతాబాద్‌ మహ గణపతి. కిందటి సంవత్సరం 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహా గణపతి ఈ సంవత్సరం 63 అడుగుల్లో దర్శనమివ్వనున్నారు మహా గణపతి. ఈ సంవత్సరం శ్రీ దశ ముఖ మహా విద్యా గణపతి‌గా భక్తులను ఆశీర్వదించనున్నారు ఆ పార్వతీ తనయుడు. శ్రీ దశ ముఖ మహా విద్యా గణపతి ఎడమ పక్కన శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి మరియు కుడి పక్కన శ్రీ వీరభద్ర స్వామి వారు కొలువు తీరనున్నారు. వెనక భాగంలో సంస్కృతంలో రాసిన మహా గ్రంథం కనిపిస్తుంది. గణపతి కాళ్ల వద్ద పది అడుగుల ఎత్తున వరాహ దేవి మరియు సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ‘శ్రీ దశమహా విద్యా గణపతి’ విగ్రహం నిల్చున్న తీరులో ఉండగా.. గణపతి తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. గణపతికి 10 చేతులు ఉంటాయి. కుడి వైపు ఉన్న చేతులతో ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్ మరియు బాణం ఉంటాయి. ఎడమవైపు ఉన్న చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణంతో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరంతో ఖైరతాబాద్ మహా గణపతి 69 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ప్రముక శిల్పి రాజేంద్రన్‌ పర్యవేక్షణలో ఈ మహా గణపతి విగ్రహం రూపుదిద్దుకుంది. శ్రీ దశ మహా విద్య గణపతి నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉంది. శ్రీ దశ మహా విద్య గణపతి గురించి ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back