కొన్ని వంటింటి చిట్కాలు | Kitchen Tips In Telugu

0
3574
కొన్ని వంటింటి చిట్కాలు | Kitchen Tips In Telugu
Kitchen Tips In Telugu

 Kitchen Tips In Telugu

ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి.

బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది.

మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది.

మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అండుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది.

ఫ్లవర్‌వేజ్‌లో పెట్టిన పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పోసే నీటిలో ఉప్పు వేయాలి.

వాతావరణంలో మార్పుల కారణంగా దంతపు వస్తువుల తెల్లదనం పోయి పసుపుగా మారతాయి. వాటిని నిమ్మచెక్కతో రుద్దితే తిరిగి తెల్లబడతాయి.

కుర్చీలు, బీరువాలు, సోఫాల వంటి ఫర్నిచర్‌కు రంగులు వేసినప్పుడు అది ఆరే లోపుగా కిందకు కారి వాటి కాళ్ల దగ్గర నేల మీద రంగు అంటుతుంటుంది.

పెయింట్ వేసేటప్పుడు కాళ్ల కింద పాత పేపర్‌లు కాని వెడల్పాటి సీసా మూతలు కాని పెడితే ఆ సమస్య ఉండదు.

నిమ్మనూనెలో రెండు చుక్కల వేపనూనె వేసి రాత్రి పూట దీపం వెలిగిస్తే గదంతా సువాసన పరుచుకోవడంతో. పాటు దోమలు పోతాయి.

ఇది పూర్తిగా సహజసిద్ధమైనది కావడంతో మస్కిటో రిపెలెంట్లు, కాయల్స్‌తో వచ్చే సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.

షూ పాలిష్‌తో మెరిసేది షూస్‌ మాత్రమే కాదు ఫర్నీచర్‌ కూడా. ఫర్నీచర్‌కు పట్టేసిన మరకలు పోవాలంటే షూ పాలిష్‌తో తుడవాలి.

సిగరేట్‌ నుసికాని సాంబ్రాణి కడ్డీల నుసిలో కాని వెనిగర్‌ కలిపి ఆ పేస్టుతో తుడిస్తే ఫర్నీచర్‌ మీద గీతలు పోతాయి.
ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరవాలంటే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను టీ పౌడర్‌ కలిపి అందులో ముంచిన క్లాతుతో తుడవాలి.

ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌లో అంతే మోతాదు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరుస్తాయి.
వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే బూడిదతో కాని బూడిదలో ఉప్పు కలిపి కాని రుద్దాలి.

వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే, కొద్దిగా వాషింగ్‌ పౌడర్‌ కలిపి మరిగించిన నీటిలో పదిహేను నిమిషాల సేపు నానబెట్టాలి.

సబ్బు నీటిలో నుంచి తీసినతర్వాత నీటి ధార కింద జాగ్రత్తగా కడగాలి.

వజ్రాల ఆభరణాలను ధరించేముందు మెత్తటి పొడి వస్త్రంతో తుడవాలి. ఎక్కువ రోజులు దాచి ఉంచినప్పుడు కాస్త డిమ్‌ అవుతుంటాయి. ఇలా తుడిస్తే ప్రకాశవంతంగా ఉంటాయి.

ముత్యాల నగలను గాలి తగిలే విధంగా జాగ్రత్త చేయాలి. ఎక్కువ రోజులు గాలి చొరని బీరువాలలో ఉంచినట్లైతే రంగు మారతాయి.

వాటిని ధరించే ముందు మెత్తటి క్లాత్‌తో మెరుగుపెట్టినట్లు సున్నితంగా తుడవాలి.

వంట పాత్రలు మాడి లేదా పదార్థాల అవశేషాలు పట్టేసి మరకలైతే వాటిని శుభ్రపరిచే ముందు ఒక టబ్‌లో నీరు పోసి అందులో కొద్దిగా బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పాత్రలను ముంచి తీయాలి.

మస్కిటో మ్యాట్‌లకు పీల్చుకునే గుణం ఎక్కువ. దుస్తుల మీద పదార్థాలు ఒలికినప్పుడు వాడేసిన మస్కిటో మ్యాట్‌లతో అద్దినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

ఫ్లాస్క్‌లను కొద్ది రోజులు వాడిన తరవాత వాసన వస్తుంటాయి. ఎంత కడిగినా ఆ వాసన వదలదు. అలాంటప్పుడు ఫ్లాస్క్‌లో వెనిగర్‌ కలిపిన వేడినీటితో నింపి అందులో కోడిగుడ్డు డొల్ల ఒకటి వేసి నాలుగైదు గంటల సేపు మూత పెట్టి ఉంచాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here