వంటింటి చిట్కాలు | Kitchen Tips in Telugu

1
2524

 

12006226_1697476847152402_8158595598885577421_n
వంటింటి చిట్కాలు | Kitchen Tips in Telugu

*కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.

*పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి.

* నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.

*పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.

*పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.

*అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడగడంవల్ల బాగాశుభ్రపడతాయి.

*వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి.

*పసుపు నీటితో కిచెన్ను శుభ్రంచేయడం వల్ల ఈగలు రావు.

*బిస్కెట్ పేకెట్ బియ్యండబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు

*ఇంగువ నీల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.

*నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.

*క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.

*కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.

*బట్టలపై నిమ్మరసంగానీ,టూత్ పేస్ట్ గానీ వేసిరుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి.

*ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.

*కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.

*వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.

*మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుపవస్తువు ఏదైనా వెయ్యాలి.

*బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.

*నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి.

*చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.

*వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.

*గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.

*పకోడిలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి.

*కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
ఫ్లాస్క్ ని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగ తో కడిగితే సరి.

*బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.

*వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here