ఈ రోజు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

0
3282

Back

1. కోజగారి పూర్ణిమ

కోజగారి పూర్ణిమ శరదృతువు లో ఆశ్వీయుజ మాసము పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ,కాముడిపున్నమి అని కూడా అంటారు. శరత్కాల పూర్ణిమ నాడు అమ్మవారిని పూజించడం చాలా విశేషం. నవరాత్రులే కాక, పాడ్యమి నుండి పూర్ణిమ వరకు అమ్మవారి ఆరాధన వలన, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ పూర్ణిమే శ్రీవిద్యా సంప్రదాయంలో “ముఖ్యరాకా”గా చెప్పబడినది.

 అనుగ్రహము కొరకు ఈరోజు కోజాగారీ వ్రతాన్ని ఆచరించాలని వాలఖిల్య మహర్షి మిగతా మునులకు తెలియజేసినట్లు పురాణ కథనం.
ఉభయ సంధ్యలలో లక్ష్మీదేవిని పూజించి, క్షీరాన్నమును నైవేద్యంగా సమర్పించాలి.
రాత్రి జాగరణ చేస్తూ ఆ సమయంలో పాచికలు లేదా గవ్వలను ఆడుతూ గడపాలి. మరునాడు పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహమునకు పాత్రులవుతారు.
హిందువులు ముఖ్యముగా మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here