-
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad -
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad
1. స్థలపురాణమ
త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వన విహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.
అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.
ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్టించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి “శ్రీరామలింగేశ్వరస్వామి” అని పేరు వచ్చినది.
Pic: కీసరగుట్టపై వున్న ఆంజనేయ స్వామి విగ్రహముతరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ట జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను.
ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద ‘కేసరి గిరి’గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను.
హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్టించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.
కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్ట’గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.
Promoted Content
Home తెలుగు ఆధ్యాత్మికం హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ద శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి | History of...