1. జీవితం ఒక ప్రయాణం…
మొదలెట్టిన దగ్గరనుంచీ ముగించే వరకూ. అందుకే రకరకాల పేర్లున్నాయి. జీవనయానం, జీవితనౌక, బ్రతుకుబండి. మరి జీవించేవాడిని నావికుడు, చోదకుడు లేక ప్రయాణికుడు అనవచ్చేమో. విహారి అని కూడా అనవచ్చు.
మనందరికీ…. అదే సమస్త జీవజాలానికీ మొదటి మజిలీ ఏంటో తెలుసా….? తల్లి గర్భం. తరువాత తల్లి ఒడి, తండ్రి ఒడి తరువాత మిగిలిన ప్రపంచం. సౌర కుటుంబంలోని గ్రహాలన్నిటిలో భూమి ప్రత్యేకమయినట్లే మనిషి కూడా సకల చరాచరాల మధ్య ప్రత్యేకం.
రెండు కాళ్లమీద నిలబడే సమతౌల్యం, ఆలోచనలు, అభివృద్ధిని కాంక్షించే తత్వం, ఇతర భావోద్వేగాలూ మనిషి ప్రత్యేకతలు.
Promoted Content
Super