లవ్ ఈజ్ పర్ లూజర్స్

0
4513

పార్కులోని టీనేజర్ వేసుకున్న టీ షర్టుమీద ఇలా ఓ రాసి ఉంది. “లవ్ ఈజ్ పర్ లూజర్స్”  అటుగా వెళ్లే ఓ పెద్ద మనిషి అది చదివి ఆమెని అడిగాడు. “అది చాలా విషాదకరమన వాక్యం. ఇలాంటి నెగిటివ్ కోట్ గల టీ షర్ట్ని ఎందుకు ధరించావు?”

ఆమె అతనికి ఇచ్చిన సమాధానం నుంచి మనమంతా నేర్చుకోగల ఓ గొప్ప పాఠం ఉంది.

“సార్! ఇది నెగటివ్ వాక్యం కాదు. ఓ విషయాన్ని తెలియ జెప్పే వాక్యం మాత్రమే. టెన్నిస్లో జీరో స్కోర్ బదులు “లవ్ అని వాడతారు. స్కోర్ లవ్ అంటే స్కోర్ జీరో అని ఆ ఆటలో అర్థం. అందువల్ల లవ్ స్కోర్ వచ్చేవారు టెన్నిస్ లో అపజయాన్ని పొందినవారు అవుతారు. ఇది టెన్నిస్ ఆట గాళ్లని హెచ్చరించే వాక్యం.”

ఆ పెద్దాయన వెంటనే చెప్పాడు. “నాలోని లోపం నాకిప్పుడు తెలిసి వచ్చింది. కనపడేదంతా నిజం అని నమ్మి దాన్ని యధాతథంగా తీసుకోవడం తప్పు.

ముఖ్యంగా మనుషుల్లోని లోపాలని గ్రహించే విషయంలో పూర్తి సమాచారం లేకపోతే వారిని మనం తరచు తప్పుగా అర్థం చేసుకుంటాం.

అందువల్ల ఎదుటి వారికి మన మాటల వల్ల హాని కూడా జరగవచ్చు. దాన్ని విరమించుకోవాలనే సందేశం నాకు నీ టీషర్ట్ మీది కొటేషన్ ఇచ్చింది” చెప్పాడా పెద్దాయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here