రాజస్థాన్ లోని అచలేశ్వర మహాదేవుని గుడి అత్యంత మహిమాన్వితమైనది. 2500 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం లో మహాదేవుని కాలి వేలుని పూజిస్తారు.స్వయంభువైన అచలేశ్వర స్వామి సూర్య కాంతికి అనుగుణంగా రోజులో మూడు పూటలా మూడు రంగులలో దర్శనమిస్తారు. ఉదయం ఎరుపు రంగు లోనూ, మధ్యాహ్నం కుంకుమ రంగులోనూ, సాయంత్రానికి గోధుమ రంగులోనూ దర్శనమిస్తారు. ఆ శివలింగం యొక్క మొదలు ఎక్కడుందో తెలుసుకుందామని గ్రామస్థులు ఎన్నో అడుగులు తవ్వి చూసినా ఫలితం లేక పోయింది. ఆ మహాశివుని మహిమను గ్రామస్థులు గ్రహించారు. అక్కడి కొలను చుట్టూ మూడు రాతి తో చేసిన నంది విగ్రహాలు, ఒక లోహ నంది ఉంటాయి. ఒకనాడు తురుష్కులు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా ఆ లోహపు నంది లోంచి కొన్ని వేల కందిరీగలు ఆ సైన్యం పై దాడి చేసి వారిని తరిమి తరిమి కొట్టాయి.
రాజస్థాన్ లోని మారు మూల పల్లె అయిన చంబల్ గ్రామం ఒక అద్భుత పుణ్య క్షేత్రం. అవివాహితులైన యువతీ యువకులు, పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంటలు ఎందరో స్వామిని పూజించి తమ ఫలితాన్ని పొందారు.