చంద్ర గ్రహణం రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

0
3744

చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే క్రింది సమాచారము మీ కొరకు పొందుపరచబడుతున్నది.

చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?

ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా తేది : 16 – 07 – 2019 ,మంగళవారము రోజు.

చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?

ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా తేది : 16 – 07 – 2019 , మంగళవారం రోజు ప్రారంభమగు చంద్ర గ్రహణము…. కేతుగ్రస్త ఖంఢగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణము కలదు.ఈ గ్రహణము భారతదేశం అంతటా కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది కాబట్టి గ్రహణ నియమాలను తప్పక పాటించాలి.

గ్రహణ సమయ వివరాలు

గ్రహణ స్పర్శ కాలము :
తేది : 17 – 07 – 2019 , బుధవారం , తెల్లవారుజామున 1:30 am ని॥లకు
(16-07-2018 రాత్రి 12 గం. దాటిన తరువాత తేదీ మారుతుంది కాబట్టి గమనించగలరు)

గ్రహణ మధ్య కాలము :
తేది : 17 – 07 – 2019 , బుధవారం , తెల్లవారు జామున 03:00 am గం॥ లకు

గ్రహణ మోక్ష కాలము :
తేది : 17 – 07 – 2019 , బుధవారం , తెల్లవారు జామున 04:29am ని॥లకు

ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 02:59 ని॥లు కలదు.

గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?

వృద్ధులు , పిల్లలు , వ్యాధి గ్రస్థులు మరియు గర్భిణీ స్త్రీలు తేది : 16 – 07 – 2019 , మంగళవారం , సాయంత్రం 05:30 ని॥ల నుండి గ్రహణ మోక్ష కాలం వరకు గ్రహణ నియమాలను పాటించాలి.

వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని , గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

ఇట్టి చంద్ర గ్రహణం….. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలం కలదు ?

  • కర్కాటక రాశి , తుల రాశి , కుంభ రాశి , మీన రాశుల వారికి ? శుభ ఫలం
  • మేష రాశి , మిధున రాశి , సింహ రాశి , వృశ్చిక రాశి వారికి ? మిశ్రమ ఫలం
  • వృషభ రాశి , కన్య రాశి , ధనస్సు రాశి , మకర రాశి , వారికి ? అశుభ ఫలం

గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?

  • ధనస్సు రాశి, మకర రాశి మరియు ఉత్తరాషాడ నక్షత్రం వారు మరియు గర్భిణీ స్త్రీలు ఇట్టి చంద్ర గ్రహణాన్ని వీక్షించకూడదు.
  • గ్రహణ మోక్ష కాలము పూర్తయిన తర్వాత స్నానమాచరించి , సద్భ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సమేతంగా స్వయంపాక దానాలు ఇవ్వాలి.

క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .

గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడం సంపూర్ణ ఫలప్రదము,పుణ్య ప్రదము.

దోషపరిహారము

ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఒక కేజి మంచి బియ్యం, ఒక వెండి సర్పపు ప్రతిమ కలిపి కింది సంకల్పం చెప్పకొని దానమీయవలెను.

సంకల్పం

ధనూ,మకర రాశుల వారు కింది సంకల్పం తో దానమీయవలెను

మమ జన్మ నక్షత్ర సూచిత కేతుగ్రస్థ చన్ద్ర గ్రహణ దోష నివృత్యర్ధం.

గ్రహణ నియమాలను అందరూ తప్పకుండా పాటించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here