భోగము – రోగము

0
12353

luxury - disease

సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం

భావం – ఎంతో ఆనందంగా స్త్రీ సుఖాన్ని అనుభవిస్తాడు. తరువాత రోగాలతో బాధపడుతాడు. అటువంటి వాడు త్వరగా మరణిస్తాడు. వీడికి మరణమే గతి. ఇవన్ని తెలిసిన పాపాలు చేయడం మాత్రం మానడు.

వివరణ – గత కొన్ని సంవత్సరాల నుండి ఏ దేశం చుసినా ఒక భయానక రోగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రోగాన్ని గురించి శంకరాచార్యులవారు ఎప్పుడో చెప్పారు. పైగా ఆ రోగం పాపాచరణం ,వాళ్ళ కామబుద్ధి వల్ల వస్తోంది అని కూడా చెప్పారు. పరస్త్రీ వ్యామోహం అన్ని పాపాలకన్నపెద్ద పాపం అంటున్నారు.
మన సంస్కృతి వివాహం అనే ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వివాహ జీవితాన్ని చక్కగా గడిపేవాడు తాను ఆనందంగా ఉండటమే కాక తన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ఆనందంగా వుంచగలడు. ఆ నియమాన్ని, వ్యవస్థను దాటిన రోజున ఇలాంటి భయంకరమైన రోగాలు పుడుతాయి. ఈ విషయం లో స్త్రీలు పురుషులు ఇద్దరు జాగ్రత్తగా వుండాలి. పిల్లలకు సరి అయిన పద్ధతిలో విద్యనూ బోధించాలి. ఎప్పటినుండో ప్రభుత్వం ఇటువంటి రోగాలను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంది. కాని ఇది నినాదాలతో లేదా పోస్టర్లతోనో అయ్యే పని కాదు. ఏ మనిషికి ఆ మనిషి నైతికత ను పెంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here