మాచీపత్రం | Machi patram

0
2983
artemisia_vulgaris_mugwort_leaf_HariOme
మాచీపత్రం | Machi patram

మాచీపత్రం | Machi patram

సుమఖాయ నమః మాచీపత్రం సమర్పయామి –

తెలుగులో కూడా దీనికి మాచపత్రి అనే పేరు. సంస్కృతంలో దీనికి స్ధౌణేయకము, బర్హిబర్హ, శుకపుష్ప అని పర్యాయ నామములు కలవు. దీని వృక్షశాస్త్ర శాస్త్రీయ నామము ఆర్డిమీసియా వల్గారిస్(Artemisia Vulgaris), కుటుంబం కంపోజిటే (Compositae).

ఇది చేమంతి జాతికి చెందిన సుగంధ యుక్త క్షుపము. దీని పత్రములు కూడా చామంతి పత్రములవలెనే ఉండి సుగంధ పరిమళముతో ఉంటాయి. ఇది త్రిదోషహరముగా, దుర్గంధ హరముగా, తిలకాలక హరముగా, క్రిమి హరముగా మరియు గ్రహ బాధ నుంచి విముక్తి కలిగించేదిగా భావ ప్రకాశమున వర్ణించబడింది.

సుముఖమునకు మరియు మాచీ పత్రమునకు కొంత సంబంధము కలదు. సుముఖమనగా మంచి ముఖము. సుశృత వచనము ప్రకారము ముఖమనగా

ఓష్టౌచ దంత మూలాని దస్త జిహ్వాచ తాలుచ |

కంఠం ముఖంచ సకలం సప్తాంగం ముఖమూచ్యతే ||

పెదవులు, చిగుళ్ళు, దంతములు, నాలుక, అంగిలి, కంఠము మరియు నోరు -ఈ 7 భాగములు కలిగినది ముఖము. ఈ ముఖము నుంచి వచ్చే దుర్గంధమును హరించేది లేక సుఖమును కల్లించేది మాచీ పత్రం. వ్యావహారికమున ముఖమునందు చెక్కిళ్ళకు ప్రాధాన్యత కలదు. వానిపై తిలకాలకము లేక నల్లని నువ్వలవంటి మచ్చలు వచ్చినప్పుడు మాచ పత్రి వాటిని నిర్మూలించి సుముఖమును కలిగిస్తుంది. మాచపత్రిని పువ్వులతోపాటు ఫ్రీలు శిరోజాలలో ధరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here