
Man Cheats Tamilnadu Devotee With the Name of Tirumala Darshan Tickets
తిరుమల దర్శనం టిక్కెట్ల పేరుతో తమిళనాడు భక్తుడిని మోసం చేసిన దళారీ
శ్రీ వారి దర్శనం కొరకు రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి వస్తూంటారు. ఇలా వచ్చే వారు ఏదో ఒక సేవ లేక దర్శనం టికేట్ తీసుకోని ప్లాన్ చేసుకోని వస్తారు. కాని అతి తక్కువ మంది అనుకోకుండా వస్తారు. వీళ్ళు దర్శనం టికేట్లు లేక ఇబ్బంది పదతారు. ఇది ఆసారాగా కొంత మంది దళారిలు మోసం చేస్తూ ఉంటారు. టీటీడీ ఎన్నో సార్లు చెప్పిన భక్తులు దళారుల్ని నమ్మి మోసపోతూనే ఉన్నారు.
ఈ మద్యనే ఒక తమిళనాడు చెందిన భక్తుడు ఒక దళారీ చేతిలో మోసపోయాడు. దర్శనం టికెట్ల కోసం తిరుపతికి చెందిన దళారీ వెంకటేశ్వర్‌ను నవీన్ అనే మధ్యవర్తి ద్వారా సంప్రదించాడు. ఆ దళారీ నాలుగు రూ.300 టికెట్లను రూ.18 వేలకు విక్రయించాడు. తమకు స్పెషల్ దర్శనం టికెట్లు ఇస్తారని ఆశపడితే రూ.300 టికెట్లు చూసి కంగుతిన్నారు. చేసేది ఏమి లేక విజిలెన్స్ వింగ్ అధికారులకు పిర్యాదు చేశాడు. వారు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ దళారీ ఇదివరకు కూడ చాల మందిని మోసం చేశడు అని తెలుస్తుంది.
అందుకే టీటీడీ కూడా దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకత పెరిగింది అంటున్నారు. ముందు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయగా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అంతేకాదు సామాన్య భక్తులకు ప్రాధాన్యం పెంచేందుకు వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని కూడ టీటీడీ మార్చిండం వలన భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విధానాన్ని కొనసాగిస్తామని టీటీడీ తెలిపింది. వర్చువల్ సేవా టికెట్లు కూడ ఏప్రిల్ 1 నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో దివ్య దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయనున్నది.
Related Posts
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?
తిరుమల శ్రీవారి జూన్ నెల అంగప్రదక్షిణ టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి?!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు!!
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!