మంగళగౌరి వ్రతం – ఎవరు చేయవచ్చు? వ్రత నియమాలు ఏమిటి ? | Who Should Perform Mangala Gowri Vratham in Telugu

0
8627
Mangala Gowri Vratham
Who Should Perform Mangala Gowri Vratham in Telugu

Mangala Gowri Vratham 2023

1మంగళగౌరి వ్రతము

మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత!

అలాగే మన సంస్కృతిలోని తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు వంటివన్నీ, వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.

చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని పన్నెండు నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, వాటిలో “శ్రావణమాసం” ఉత్కృష్టమైంది.

ముఖ్యంగా శ్రావణమాసం మహిళకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడం వల్ల, “వ్రతాల మాసం”గా పేరు పొందడంతో పాటు, మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడుతోంది.

శ్రావణ మాస వ్రతాలనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది – “వరలక్ష్మీ వ్రతం”. ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం – “మంగళగౌరి వ్రతం.”

దీనికే “శ్రావణ మంగళవారప్రతం” అని, “మంగళ గౌరీ నోము” అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదువతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి.

ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడ ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి “అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీకృష్ణుడు “మంగళగౌరీ మహాదేవత, ఆ పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది.

త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించ గ్రహరాజై, మంగళవారానికి అధిపతై వెలుగొందుతున్నాడు.

ఆ మంగళ గౌరిని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారములలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు.

ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్జిల్లుతారు” అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here