చూత పత్రం | Chuta Patram
ఏకదంతాయ నమః చూత పత్రం సమర్పయామి |
Chuta Patram దీనిని మామిడి అంటారు. వసంత దూత, శుకప్రియ అనేవి దీనికి పర్యాయ నామాలు. దీని శాస్త్రీయ నామము మేంజిఫెరా ఇండికా (mangifera indica), కుటుంబం – అనకార్దియేసి (Anacardiaceae).
ప్రతి శుభకార్యమున మామిడి ఆకుల తోరణము కట్టుట, మామిడి ఆకులను కలశములో ఉంచుట, పుణ్యావాచనమున మంత్రోదకమును మామిడి ఆకుతో ప్రోక్షించుట సంప్రదాయం. మామిడి పూత వసంతఋతువు ఆగమాన్ని తెలుపుతుంది. వైద్యశాస్త్రంలో ఇది మూత్ర సంగ్రహణీయ ద్రవ్యముగా చెప్పబడింది. అనగా అతి మూత్రవ్యాధిన హితము. మామిడి చిగుళ్ళు మంచి కంఠస్వరమును ఇస్తాయి.
మామిడి జీడి పేలుకొరుకు వ్యాధిని మాన్పుతుంది. గుండెలో మంట, వాంతులు మరియు అతిసార ములను నివారిస్తుంది.