మార్గశిర మాసము విశిష్టత | Margasira Masam Importance in Telugu

0
3989
Earthshine2400
Margasira Masam Importance in Telugu

Margasira Masam Importance in Telugu

శ్రీకృష్ణుడు భగవద్గీతలో మార్గశిర మాసము విశిష్టత గురించి ఇలా అనెను
వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసము విశిష్ట మైనవి అని చెప్పెను

మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అలాగే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.

చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఆధారం గా

శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!

మార్గశిర మాసము లో కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట మాత్రమే భుజించి, తనశక్తికొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు
మార్గశిర మాసము లో ఉపవాసం చేసిన వారు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here