వివాహము – Reception

1
4544
1934417_691706597633159_7855207859048073779_n
వివాహము – Reception

మన సనాతన ధర్మాలలో (శాస్త్రంలో) వివాహానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. అటువంటి వివాహాలను శాస్త్రం ఎలా చెప్పిందో మన వివాహవేదం ఎలా చెప్పిందో అలా ఆచరించాలి కాని, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్న రీతిలో ఆచరించకూడదు. మన ఋషులు త్యాగశీలులు.

వారు ఏది చెప్పినప్పటికీ మన అభ్యున్నతి కోసం, మనం ఉన్నత స్థితులను పొంది తద్వారా మోక్షాన్ని పొందాలి అని వారి ఆకాంక్ష.

అంతే కాని, ఎదో పదకొండురూపాయలు సంభావన ఇస్తాం కదా అని ఏర్పరచినటువంటి విధులు కావు. అన్ని కూడా మన అభ్యున్నతికి వారు మార్గాన్ని శూచించడానికి ఏర్పరచినటువంటి నిచ్చెనలు. సంస్కృతంలో అక్షరాలకు కూడా అర్ధాలు ఉంటాయి.

వివాహం అంటే విశిష్టమైన ఆశ్రమమును పొందటం అని అర్ధం. అంటే అతను ఇప్పటి వరకు బ్రహ్మచర్యాశ్రమములో ఉన్నాడు.

అతడు ధర్మపత్నిని స్వీకరించడం ద్వారా ధర్మ, అర్ధ, కామాలను అనుభవించి తద్వారా మోక్షాన్ని పొందటానికి ఆశ్రమమును మారుచున్నాడు.

అంతటి విశిష్టమైన ఆశ్రమాన్ని మారేటప్పుడు మన శాస్త్రాలు ఎలా చెప్పాయో, మన వివాహాలలో కూడా అనేక క్రతువులు ఉన్నాయి.

ఆ క్రతువులను అలా ఆచరిస్తేనే ఆ జంట తప్పక అభ్యున్నతిని పొందుతారు. మనము చేసేటటువంటి కొన్ని ఆచారాలు ఎలా ఉంటాయి అంటే ఎవరు, ఎందుకు మొదలు పెట్టారో తెలియదు కాని, అటువంటి ఆచారాన్ని, ఇదేదో బాగున్నది అని, ఆధునికంగా ఉంది కదా అని ప్రతి వారు కూడా దానిని ఆచరిస్తూ కొంత వివాహము అన్న పదాన్ని కలుషితం చేస్తున్నారు అనే చెప్పవచ్చు.

ఆ కోవకు చెందినదే Reception . ఇది ఎవరు, ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టారో తెలియదు కాని ఇది ప్రతివారికి ఒక పోకడ అయిపొయింది. శుభలేఖలలో కూడా దానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించేటట్టుగా ఆ పదము ఎదిగిపోయింది. అంటే, అది వివాహములో ఎంత విసిష్టస్థానాన్ని పొంది యున్నదో చెప్పవచ్చు.

వివాహం మునుపు Reception అని పెట్టి అమ్మాయిని, అబ్బాయిని పక్కపక్కన కూర్చోబెడుతున్నారు. చక్కగా దండలు మార్చుకుంటున్నారు. ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి వచ్చిన పెద్దలందరిని ఆశీర్వదించమంటే శాశ్త్రం తెలిసి ఉన్నవారు ఎలా ఆశీర్వదిస్తారు. ఎదో చిన్న పిల్లలు అనుకోండి, కళ్యాణమస్తు, వివాహప్రాప్తిరస్తు, విద్యాబుద్ధులు ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. మరి Reception లో కూర్చున్నటువంటి జంటని ఏమని ఆశీర్వదిస్తారు. వీరిద్దరికీ వివాహము నిశ్చయమైంది. ప్రక్కన కూర్చున్నారు కాబట్టి అందరమూ కూడా వారిని శ్రీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు, లేక సుపుత్రా ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాలి. కాని ఆ ఆశీర్వాదము వారికి ఎంతవరకు వర్తిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా కన్యాదాత మరియు వరుని తండ్రి, వారిద్దరిని ఏరకంగా మహారాజా కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. కన్యాదాత కన్యాదానం చేశాడా? సుముహూర్తం అయిందా? మాంగల్యధారణ జరిగిందా? ఏమి జరిగిందని వారిద్దరిని అలా కుర్చీల్లో కూర్చోబెట్టి వివాహం కాకమునుపే ముందు భోజనాలు పెడుతున్నారు? నిజంగా ఉపాసనా బలం ఉన్నవారు అయితే వారి శక్తి అంతా తుడిచిపెట్టుకొని పోతుంది. వారి పుణ్యఫలం కూడా కరిగిపోతుంది. ఆ జంటను అలా ఆశీర్వదించడం వల్ల ముఖ్యంగా కన్యాదాన ఫలితం దక్కక పోగా వారిద్దరి మధ్య నిత్య వ్యభిచారం జరుగుగాక అని దీవించినట్లేకదా.

మన వివాహ వేదంలో Reception అన్న పదానికి తావులేదు. ఎందుకంటే Reception లో మనము ఏమి చేస్తున్నాము. వేదిక మీద చక్కగా మహారాజా కుర్చీలు వేస్తున్నాము. చక్కగా అబ్బాయి, అమ్మాయి పక్కపక్కన కూర్చుంటారు. చెప్పులు, Shoes తో సహా. ఆ వేదిక మీదకి చెప్పులు వేసుకుని కూర్చొనకూడదు. ఎందుకంటే మనము వివాహ క్రతువు నిర్వహించేటప్పుడు 33 కోట్లమంది దేవతలను, ఇంద్రుడి భార్య శచీదేవిని తన సపరివార సమేతంగా వేదికమీదకి ఆహ్వానిస్తున్నాము. మనము మంత్రాలతో వారందరినీ పిలుస్తున్నాము. ఆ జంట యొక్క అభ్యున్నతి కోసమని మరి చెప్పులతోటి, Shoes తోటి మనము వేదిక మీద కూర్చుంటే ఆ దేవతలను ఆహ్వానించి అవమానించినట్టే కదా మరి. ఇది ఎంతవరకు సబబు.

అయినా వివాహం కాకుండా, అనగా కన్యాదానం కాకుండా భోజనాలు పెట్టకూడదు. విందు అన్న మాట అసలు లేనేలేదు. నేను కన్యాదానం చేసినందుకు, ఇంత గొప్ప క్రతువు నా పెద్దల ఆశీర్వాద బలం వల్ల ఆచరించినందుకు నన్ను, నా కూతురు, అల్లుడిని ఆశీర్వదించడానికి వచ్చారు. దానికి క్రుతజ్ఞ్యతగా, శాంతిగా మీరందరూ మృష్టాన్న భోజనము స్వీకరించాలి అని కన్యాదాత అన్నదానం చెయ్యాలి. వచ్చిన దౌర్భాగ్యం అంతా ఏమిటంటే, ఇప్పుడు వివాహము అంటే ఎన్ని పూట్ల భోజనం అన్న ధోరణిలోనే మన మాటలన్నీ జరిగిపోతున్నాయి.

కాబట్టి మన వివాహాలలో Reception అన్న పదానికి తావులేదు. కన్యాదాత గట్టిగా నిర్ణయించుకుని, వరుడి తండ్రితో చెప్పుకోవాలి. సుముహూర్తం ఏ సమయానికి ఉన్నప్పటికీ బావగారు! ఇది మన ఆచారం, పద్ధతి కాదు కాబట్టి, శాస్త్రోక్తంగా వివాహం అయిన తరువాత కావలిస్తే ఉభయులు ఖర్చు భరిస్తూ Reception ఏర్పాటుచేసుకుందాం. వివాహానికి ఇంత ఖర్చుపెట్టి ఇంత వైభవంగా ఎందుకు చేస్తున్నాము. వారి అభ్యున్నతి, వారి అన్యోన్యత గురించి కదా, అని ఉభయులూ కూడా ఒక మాటమీదకి వస్తే మన శుభలేఖలలో Reception అన్న పదాన్ని తేలికగా తీసివేయవచ్చు.

పాపం, యువతను తప్పుపట్టడానికి లేదు. కొన్ని విషయాలు వారికి సవివరంగా తెలియచేస్తే ఓహో! పెద్దవాళ్ళు మా కోసమే కదా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అని వారు వెంటనే ఒప్పుకుంటారు. ఆశీర్వదించే వారు కూడా మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించడం వలన ఏ మహానుభావుడి ఆశీర్వాదబలం చేతనో వారు చక్కని అభ్యున్నతిని పొందుతారు. ఆశీర్వదించేవారు మనమిచ్చే తాంబూలాలను మనస్ఫూర్తిగా స్వీకరించగలరు.

శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here