Masik Durgashtami Vrat 2024 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

0
2405
Masik Durgashtami Vrat
Masik Durgashtami Vrat 2024 Dates & Significance

Masik Durgashtami Vrat 2024

2మాస దుర్గాష్టమి యొక్క ప్రాముఖ్యత (Significance of Massik Durgastami):

మాసిక్ దుర్గాష్టమి వ్రతం పూర్వా జీవితంలో చేసిన చెడు కర్మలను తొలగించుకోవడానికి సహాయపడుతుంది. మాసిక్ దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగించడం. భక్తులు తమ జీవితాల్లో దైవిక రక్షణ, శ్రేయస్సు మరియు విజయం, శాంతిభద్రతల కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు.

మాస దుర్గాష్టమి రోజు అమ్మవారిని ఎలా పూజించాలి?! (How to Worship Goddess on Masik Durgashtami Day?!)

1. మాస దుర్గాష్టమి రోజున దుర్గా దేవి అమ్మవారి యొక్క మహాగౌరీ రూపానికి పూజలు చేస్తారు. దుర్గాదేవి అమ్మవారు రక్షణ మరియు చెడుపై విజయాన్ని సాధించే అత్యున్నతమైన మహశక్తి. మాసిక్ దుర్గాష్టమి జరుపుకోవడం వలన భక్తులు అందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి జీవితంలో అనుకున్నది సాధించవచ్చని నమ్ముతారు.
2. దుర్గామాత యొక్క ఎనిమిది రూపాలను పూజిస్తారు. పూజ సమయంలో అమ్మవారికి ఖీర్ మరియు హల్వాను ప్రసాదంగా అందిస్తారు. హిందు సంప్రదాయంలో దుర్గాష్టమి పూజ రోజున ఆడపిల్లను పూజించే ఆచారం ఉంది.
3. జీవితంలోని వివిధ అంశాలలో అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో మరియు విజయాన్ని సాధించడానికి అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.
4. ఆ రోజున దుర్గాదేవి చాలీసా, దుర్గాదేవి సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని చదవడం మంచిది పురోహితులు చేపుతుంటారు. దుర్గాదేవి అమ్మవారు అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయి అని అంటారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.