
మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి? How to do Masa Shivratri Puja?
Masa Shivarathri in Telugu – ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
1. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? Why is Masik Shivratri celebrated?
మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
చంద్రోమా మనస్సో జాతః
అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.
అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించదానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
చాలా బాగా,వివరంగా మాస శివరాత్రి గురించి
తెలియచేసారు..కృతజ్నతలు.
Thanks for ever 🙏 Explanation of Masa shivaratri is very well.