పసుపు లో దైవశక్తి, ఓషధి శక్తి కలిసి ఉన్నాయి. పూజ విధానం లో ప్రత్యేక స్థానం ఉంది. దీనివల్ల చర్మ రోగాలు నశిస్తాయి. కుంభముని అనగా అగస్త్యుడు చెప్పిన మూలికలలో పసుపు చాల ఉత్తమమైనది. దీనిని కాంచని, క్రిమిఘ్ని, గౌరీ, జయ, జయంతి, తురంగిని, దీర్ఘరంగా, నిశ, పీత, పీతక, సింగ, రజని, రంజని, మోషిద్విల్లక, వర్ణవర్ధిని, వర్ణావతి, హరిద్ర, హారిద్రిక మొదలైన పేర్లు ఉన్నాయి. ఇది మ్రాని పసుపు మంచి పసుపు అని రెండు విధాలుగా మనకు లభిస్తున్నది.
మంచిపసుపు, మ్రాని పసుపు రెండు కూడా చేదుగా, కారంగా ఉంటుంది. ఇది వేడి ని తగ్గిస్తుంది. విష లక్షణాలను హరిస్తుంది. పుళ్ళను మాన్పుతుంది, దురదలు మొదలైన చర్మ వ్యాదులను దూరం చేస్తుంది, మేహశాంతి ని కలిగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మ్రానిపసుపు ని ఎక్కువగా వైద్య రంగం లో వాడుతారు. ఇది చర్మ రోగాలతో బాటు కర్ణ నేత్ర రోగాలను కూడా పోగొడుతుంది. అందుకే మన వంటపదార్ధాలలో పసుపు ని ఎక్కువ గ వాడుతారు. స్నాన సమయంలో పసుపు తో కూడిన పిండి రాస్తే చర్మరోగాలు పోతాయి.
పసుపు ని శుభసమయం లో ఇంటి గడపకు రాస్తాము దీని వలన ఇంటిలోకి రోగాలను వ్యాపించే క్రిములు రావు. స్త్రీలకూ సువాసిని చిహ్నములు పసుపు కుంకుమాలే.