ధ్యానం అంటే ఏమిటి ?ఎలా చేయాలి?

0
7846
images
what is meditation in telugu

what is meditation in telugu

 
ధ్యానం అంటే ?

(what is meditation in telugu) ఏదైనా ఒక వస్తువు మీదనో, శబ్దం మీదనో, విషయం మీదనో మనసును పూర్తిగా కేంద్రీకరించడమే ధ్యానం. ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచంలో ఒత్తిడిని జయించే సులభ సాధనం ధ్యానమే. శరీరాన్ని, మనసును తేలిక పరుస్తుంది ధ్యానం. ఉద్రిక్తతలను ఉద్వే గాలను పారద్రోలుతుంది. మానసిక ప్రశాంతత నిస్తుంది ధ్యానం. ఏకాగ్రత, జ్ఙాపకశక్తి, సృజనాత్మకత మెరుగయ్యేది ధ్యానం వల్లనే.

 
ఎలా చేయాలి?

ఇంట్లో ఒక అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ ప్రశాంతంగా కళ్లు మూసుకుని కూర్చుని మెల్లగా శ్వాస తీసుకోవాలి. మన మనసును, ఆలోచనను శ్వాస మీదనే లగ్నం చేయాలి. ఇదే ధ్యానం చేసే పద్ధతి. మధ్యలో అంతరాయం కలిగించే ఆలోచనలను పక్కకు నెట్టేయండి. మళ్లీ యథావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. మొదట 30 సెకన్లతో మొదలు పెట్టి నెమ్మదిగా సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా రోజూ ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా పనిచేయగలుగుతాం. అంతేకాదు ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఏకాగ్రం చేయడం వల్ల నిర్మాణాత్మకమైన ఆలోచనలకు దోహదం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here