జ్యోతిశ్శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ‘‘బుద్ధిలో బృహస్పతి వంటి వాడు’’ అని వాడుతుంటారు. ‘చంద్రోమాతా పితా స్యూర్యః ప్రాణాశ్చైత బృహస్పతిః’ అని ఉపనయన ముహూర్త విషయంలో, అక్షరాభ్యాస, అన్నప్రాసన, గర్భాదాన, దేవాలయ ప్రతిష్ఠా విశేషాల్లో బృహస్పతి బలం లేని ముహూర్తం పెట్టకూడదని శాస్త్రం. మనిషి బతికినంత కాలం వాడకం కోసం జీవనం కోసం అవసరమయ్యే ధనం, విద్య, దేహ పుష్టి గురు గ్రహం ద్వారా లభించేవి. ‘గురుణా దేహ పుష్టిశ్చా బుద్ధిః పుత్రార్ధ సంపదః’
బృహస్పతి యొక్క సానుకూల ఫలితాలు పొందడం కోసం పారసంతో చేసిన సాయిబాబాఆరాధన విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యను అయినా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. ఈయన అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. ‘కేంద్రాదిపత్య దోష స్తు బలవాన్ గురు శుక్రయోః మారక త్వేపిచ తమోః మారక స్థాన్ సంస్థితిః’ అని పరాశరులు చెప్పారు. కేంద్రాధిపత్యం వచ్చిన బృహస్పతి బహుదోషి. ఈయన మారక స్థానంలో ఉంటే వెంటనే మారకం చేస్తారు అని శాస్త్ర వచనం. అలాగే జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్న వారు,గురువు తృతీయంలో ఉండటం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబా ను పూజించిన గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోష పరిహారం జరుగుతుంది.పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించి “ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్” అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.మంత్ర జపానంతరం దూప,దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించి పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.