
మోహినీ ఏకాదశి | Mohini Ekadashi in Telugu
వైశాఖ శుద్ధ ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని అంటారు. సముద్ర మథనం జరిగిన తరువాత దేవదానవులు అమృతం కోసం తగవులాడుకున్నారు. అమరత్వాన్ని (మరణం లేకుండా ఉండడం) పొందాలంటే వారు ధర్మ ప్రవర్తనులై ఉండాలి. వారివలన సమస్త లోకాలకు మేలు జరగాలి. కానీ అసురులు అమృతాన్ని తాగి ముల్లోకాలనూ అనుభవించదలచారు. ధర్మాన్నీ, జ్ఞానాన్నీ వారు లేక్ఖ చేయలేదు.
దేవతలు జ్ఞానాన్ని , ధర్మ ప్రవర్తనను అంగీకరించి ఆచరించారు. అటువంటి దేవతలకు అమరత్వం రావడం న్యాయం కనుక , శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం దాల్చి, కాంతా వ్యామోహం లో ఉండే ఆ రాక్షసులని ఏమార్చి అమృతాన్ని దేవతలకు పంచిన రోజు ఇది. అందుకని ఈ రోజుని మోహినీ ఏకాదశి అంటాం. మోహినీ ఏకాదశినాడు సముద్ర మథన వృత్తాంతాన్ని చదువుకుని, విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఉపవాస దీక్షను చేపట్టి, ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కుటుంబ సమస్యలు తొలగుతాయి. కీర్తి, ధనం వృద్ధి చెందుతాయి….
నాట్యం చేసే ముందు భూమికి ఎందుకు నమస్కరిస్తారు? | Why to Prostrate Earth Before Dance in Telugu
Kumba Mela gurinchi dates change cheyaledu.. last year vi vunnayi.. gamaninchagalaru..