ఎక్కువ – తక్కువ

0
4775
ఎక్కువ - తక్కువ
ఎక్కువ – తక్కువ

ఎక్కువ – తక్కువ

అనగనగా ఒక అడవిలో ఒక ఆడ కుందేలు, మగకుందేలు నివసించేవి. ఆడకుందేలుకు గర్వం ఎక్కువ. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు.

పెద్ద జంతువులకి మర్యాద ఇచ్చేది కాదు. తనకన్నా చిన్న ప్రాణులనైతే మరీ చులకనగా చూసేది. మగ కుందేలు మాత్రం ఎంతో మంచిది.

‘ఎవరి అవసరం ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పలేం, అందరితో మంచిగా ఉండు’ అని చెప్పేది. అయినా వినిపించుకునేది కాదు ఆడ కుందేలు.

కుందేళ్లు ఉండే చోటికి దగ్గర్లోనే ఒక సాలెపురుగు తన పరివారంతో జీవిస్తుండేది. దానిది నలుగురికీ సహాయపడే స్వభావం కావటంతో జంతువులన్నీ సాలెపురుగుని ప్రశంసించేవి.

దాంతో కుందేలుకు అసూయగా తోచేది. ఎలాగైనా దానికి కీడు చేయాలని చూస్తూ ఉండేది.

ఓసారి ఆడ కుందేలు ఒంటరిగా ఉంది. అది గమనించిన ఓ తోడేలు దాన్ని చంపేయాలని ప్రయత్నించింది. తప్పించుకోడానికి కుందేలు పరుగుతీసింది. తోడేలు తరుముతుంటే మరో మార్గం లేక పాడుబడిన బావిలోకి గెంతింది. ఇదంతా సాలెపురుగు చూసింది.

అది వెంటనే తన పరివారంతో అక్కడికి వచ్చి, తోడేలు వచ్చేలోగా బావిమీద చిక్కగా గూడు అల్లేసింది. తర్వాత తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పి ఆకులు, గడ్డి కప్పించేసింది. కుందేలును వెతుక్కుంటూ వచ్చిన తోడేలుకు అది కనిపించకపోవడంతో నిరాశగా వెళ్లిపోయింది.

దెబ్బతో కుందేలుకు బుద్ధి వచ్చింది. సాలెపురుగు పట్ల, ఇతర జీవుల పట్ల తన ప్రవర్తనను గుర్తుతెచ్చుకుని సిగ్గుపడింది. సాయం చేసినందుకు వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది.

నీతి: అహంకారం, ఆధిక్యధోరణి ఉండకూడదు. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here