దోమల నివార‌ణకు టిప్స్ | How to Control Mosquito in Telugu

1
29944
Mosquito
దోమల నివార‌ణకు టిప్స్ | How to Control Mosquito in Telugu

 How to Control Mosquito in Telugu

దోమల కారణంగా ప్రజలు అనేక మంది రోగాల బారిన పడుతున్నా రు. దోమల నివారణకు మస్కిటో కాయిల్స్‌, ఎలక్ర్టికల్‌ రీఫిల్స్‌, బ్యాట్స్‌, బాల్స్‌ ఇలా ఎన్నో పరికరాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం.

అయినా నివారణ సాధ్యం కావడం లేదు. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలు వినియోగించుకుని దోమలను నివారించవచ్చు.

ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న వేప గింజలు, కర్పూరం, చామంతి పూలు, పేడ, చక్కెర వంటి వాటిని వినియోగించి అతి తక్కువ ఖర్చుతో దోమలు నివారించవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి పరిశీలిస్తే…?

వేప పిండితో..

నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేప పిండి చల్లడం ద్వారా దోమల సంతతిని అరికట్టవచ్చు. నీరు నిల్వ ఉన్న గుంతల్లో, స్టోరేజ్‌ ట్యాంకుల్లో 100 గ్రాముల తాజా వేపగింజల పొడిని చల్లితే దోమలు గడ్లు పెట్టవు.

ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా నివారించవచ్చు.

వేప నూనె దీపంతో..

వేప నూనె 200 మిల్లీ లీటర్లు, కిరోసిన్‌ 100 మిల్లీలీటర్లు కలిపి లాంతర్లో వేసి ఇంట్లో దీపం వెలిగించాలి. ఆ దీపం నుంచి వచ్చే పొగ వాసనకు దోమలు దరి చేరవు.

ఇలా ప్రతి ఇంటిలో ఈ దీపాలు వెలిగిస్తే ఆ పరిసరాల నుంచి దోమలను పూర్తిగా పారదోలవచ్చు.

వేప నూనె మిశ్రమం ..

వేప నూనె 2 మిల్లీలీటర్లు, కొబ్బరి నూనె 100 మిల్లీలీటర్లలో కలిపి, చెంచా ఆవ నూనె, లేకుంటే నువ్వుల నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు కాళ్లు, చేతులు, శరీరానికి రాసుకోవాలి.

ఈ చేదు వాసన ప్రభావంతో దోమలు దరి చేరవు. చామంతి బిళ్లలతో ..

చామంతి పూలను ఎండబెట్టి, వాటికి కొంచెం పేడ కలిపి, చిన్న చిన్న బిళ్లలుగా చేసి ఎండ బెట్టాలి. బాగా ఎండిన ఈ బిళ్లలను రాత్రి పూట వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి రావు.

డెంగీ దోమల నివారణకు..

నిమ్మకాయను సగానికి కోసి, దానిలో లవంగం మొగ్గను గుచ్చాలి. వాటిని పగటి పూట గదిలో ఉంచితే డెంగీని వ్యాప్తి చేసే దోమలు ఆ ప్రాంతంలోకి రావు.

ఇళ్లలో దొరికే పదార్థాలతో..

ఇళ్లలోని మూల ప్రాంతాల్లో కర్పూరం వెలిగించినా దోమలు నివారించవచ్చు. 20 మిల్లీలీటర్ల నీటిలో 20 గ్రాముల చక్కెర, రెండు గ్రాముల ఈస్ట్‌ను కలిపి తీసుకోవాలి.

చక్కెర నీళ్లను తీగ పాకం వచ్చేలా చేయాలి. రెండు లీటర్ల నీళ్ల బాటిల్‌ తీసుకోవాలి. దాన్ని సగానికి కత్తిరించి అందులో పాకం వేయాలి.

పైన ఈస్ట్‌ను చల్లాలి. దీని ద్వారా వచ్చే వాసనకు దోమలు దూరమవుతాయి.

గృహాలు, సమీప పరిసరాలు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో దోమలు వృద్ధి చెందకుండా చూడవచ్చు.

పనికి రాని పాత వస్తువులను ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సిబ్బందికి ఇచ్చేయాలి.

వినియోగించని బూట్లు, బాటిల్స్‌, ప్లాస్టిక్‌ డబ్బాలు దోమల నివాసాలుగా ఉంటాయి. ఇలాంటివి ఇళ్లలో లేకుండా చూసుకోవాలి.

వారంలో ఒక రోజు మంచి నీటి ట్యాంకులు శుభ్రం చేసి ఎండబెట్టాలి. మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి.

చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉంటే చెట్లు పెరగకుండా, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటిలో ఎల్లప్పుడూ గాలి ప్రసరించేలా ఉంచుకోవాలి. ఇళ్లలో ఎయిర్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వాటర్‌ బాటిల్స్‌ వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

కొబ్బరి బోండాలు లాంటివి వెంటనే కాల్చి వేయాలి.

టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.

ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.

నిత్యం చెత్త డంపింగ్‌ యార్డులకు తరలివెళ్లేలా అధికారులు చూడాలి. ఆరు నెలల పాటు ఇలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే దోమలను దాదాపుగా నివారించవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here