చక్కని సంతానం కోసం, నాగ పంచమి – గరుడ పంచమి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Naga Panchami in Telugu

0
19895

 

Back

1. నాగ పంచమి | Naga Panchami

శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున “ నాగ పంచమి“గా కొంతమంది “గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో “నాగ పూజ“కి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది.

నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్ పరమ శివుడే స్కంద పురాణములో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే నాగ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది.

అందుకు కారణము ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆదిశేషుడు “తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని“ వరం కోరుకున్నాడు.

ఆదిశేషుని కోరికని మన్నించి మహా విష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.

నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేస్తారు.
నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి

విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః,

న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్

ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు.
సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది.
సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here