
Narasimha Jayanti In Telugu
“వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్”
వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనన నృసింహావతామును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణంలో కలదు.
1. నృసింహ అవతార కథ
శ్రీ మహా విష్ణుని నివాసమైన వైకుంఠానికి జయవిజయులనే సంరక్షకులు ఉండేవారు. వారు నారాయణుని పరమభక్తులు.
ఒకనాడు సనక సనందనాదులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు. వారు వచ్చిన సమయం శ్రీమహావిష్ణువు ఏకాంత సేవలో ఉండే సమయం కావడంతో జయవిజయులు వారిని అడ్డగించారు.
ఆగ్రహించిన సనక సనందనాదులు వారిరువురినీ శ్రీమహా విష్ణువుకి దూరంగా భూమండలం పై పలు జన్మలెత్తమని శపించారు.
జయవిజయులు సనకాదులను వేడుకొన్నారు. తమ కర్తవ్యాన్ని పాలించడం తప్ప తాము చేసిన తప్పేమీ లేదని, శాపవిమోచనం అనుగ్రహించమని, శ్రీ మహా విష్ణువుని అంతకాలం విడిచి ఉండలేమని ప్రార్థించారు.
Comment:very good article
thank you