సోంఫు, పటికబెల్లం, బాదాములు సమాన భాగాలు గా తీసుకోవాలి. సోంపు, బాదాములు బాగా ఎండపెట్టి పటికబెల్లం తో కలిపి బాగా చూర్ణం చేయలి . సోంఫు ని కొంచం వేయించాలి. దానివలన సోంఫు కి ఉన్నటువంటి చేదు తగ్గుతుంది. తరవాత మూడింటిని బాగా మెత్తగా చూర్ణం చేసి రోజు గ్లాస్ పాలలో కలిపి పొద్దున్న, సాయంత్రం స్పూనున్నర తీసుకుంటే శరీరానికి విపరీతమైన బలం కలుగుతుంది. ఆకలి పెరుగుతుంది. మంచం లొ ఉన్నటువంటి పెద్దవారికి ఇస్తే వారు లేవగలుగుతారు . చిన్నపిల్లలకి బూస్ట్, హార్లిక్స్ బదులు ఇది ఇవ్వడం వలన శక్తిమంతం గా తయారు అవుతారు. షుగర్ ఉన్నవారు పటికబెల్లం తగ్గించి వేసుకోవచ్చు