సద్దుల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 9th / Last Day Saddula Bathukamma

0
197
9th Last Day Saddula Bathukamma
What is the 9th / Last Day of Bathukamma? i.e, Saddula Bathukamma

Saddula Bathukamma

1సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Saddula Bathukamma?)

అక్టోబరు 22 2023న దుర్గా అష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. బతుకమ్మ పండగలో ఆఖరి 9వ రోజు వేడుకను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను చాలా పెద్దగా మరియు అందంగా వివిధ రంగులతో ముస్తాబుగా చేస్తారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన ఒక చిన్న గౌరమ్మను పసుపుతో తయారు చేస్తారు. గౌరమ్మను పూజించిన తర్వాత ఆడవారు అందరు ఆ పసుపును తీసి వారి చెంపలకు రాసుకుంటారు. రాక్షసుడిని చంపి అలసిపోయిన అమ్మవారికి పాకాలు నైవేద్యాలుగా పెడుతారు. భక్తులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు అమ్మవారికి సమర్పిస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అని అంటారు. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా చివరి రోజు బాగా కొలహలంగా చేస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back