ఐశ్వర్యము, వాక్ శుద్ది, మథుర భాషణ, సమయ స్పూర్థి, భక్తిశ్రధ్ధలు కలగాలి అంటే ఏమి చెయ్యాలి ?

0
21359
Navarathri_at_Parashakthi_Temple-300x287
ఐశ్వర్యము, వాక్ శుద్ది, మథుర భాషణ, సమయ స్పూర్థి, భక్తిశ్రధ్ధలు కలగాలి అంటే ఏమి చెయ్యాలి ?

సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు
. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్ఫూర్తి , వాక్ శుద్ది , భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు “అమ్మ” అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని పెద్దల మాట ..

1. పూజా విధానము

పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
నివేదన: దధ్యన్నము, కట్టుపొంగలి
పారాయణ: అన్నపూర్ణ అష్టోత్తరము, స్తోత్రములు

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here