
Maruvaka patram / మరువక పత్రం
ఫాలచంద్రాయనమః మరువక పత్రం సమర్పయామి
దీనిని వాడుక భాషలో ధవనము, మరువకము అని అంటారు. దీనికి సంస్కృతంలో సురాహ్వా, ఆజన్మ సురభి పత్ర అని అంటారు. దీని శాస్త్రీయ నామము origanum marjoram. మరువమును ఉపవనములలో పూలతో పాటు వ్యాపార సరళిలో పెంచుతారు. ఈ మరువము ఎండి పోయినా కాని దీని సుగంధము ఆ విధం గానే ఉంటుంది. అందువల్ల ఆజన్మసురభి అని అంటారు. దీనిని పూవులతోపాటు అల్లి జడలో ధరిస్తారు. ఇది క్రిమి-కుష్ట- దుర్గంధ- విషహరములుగా పనిచేస్తుంది.