పొలాల అమావాస్య నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Polala Amavasya pooja In Telugu

0
21481
ammanphoto1
ఈరోజు -పొలాల అమావాస్య నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Polala Amavasya pooja In Telugu

Polala Amavasya Pooja In Telugu

పోలేరమ్మ అమ్మవారు’ గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం,పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.

ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ, సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.

Next

3. పాటించవలసిన ముఖ్య నియమములు

ఈ దినం తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, తలస్నానం చేసి, ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి, ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపుకొమ్ముతో గానీ, పసుపుతోగాని చేసుకొని ప్రతి ష్టించుకుని పూజ చేయాలి. ఈ పూజావిధానములో పార్వతీ దేవి అష్ణోత్తరం చదవుతూ ఉండడం విశేషం. పూజ ముగించిన అనంతరం పసుపు పూసిన దారానికి పసుపుకొమ్మ కట్టి తయారుచేసుకున్న తోరము’ ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటూ, మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి.

ఈ విధంగా పూజచేసి ‘పెరుగు అన్నం’ను నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. పెరుగన్నమును ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి.

ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు ప్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ, సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

 

Related Posts

Chaitra Amavasya 2023 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు | Amavasya Pooja Significance in Telugu !

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here