పోలి స్వర్గం | Poli Swargam in Telugu

0
18559
పోలి స్వర్గం | Poli Swargam in Telugu

పోలి స్వర్గం | Poli Swargam in Telugu

స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ‘పోలి స్వర్గం నోము‘ ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా … ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.

Poli Swargam Story

ఒక వివాహిత దేవునిపై అతి భక్తిగా ఉండేది గానీ అత్తవారింట పనులు చెప్పి సాధిస్తూ పూజ చేయనిచ్చేవారు కాదు. కార్తిక అమావాస్య నాడు ఉదయాన్నే తనని పనులు చేయమని పురమాయించి ఇంట్లో అందరూ దీపాలు పెట్టడానికి వెళ్తారు. అప్పుడామె పెరట్లోనున్న అరటిదవ్వను వలచి, వస్త్రానితో వత్తులు చేసి దీపాలుగా వెలిగించి నూతినీళ్ళలో భగవత్ప్రీతిగా అర్పిస్తుంది. దానితో భగవంతుడు సంతోషించి, అత్తవారందరూ తిరిగి వచ్చి చూస్తూ ఉండగా దివ్య విమానములో దేవాంగనలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు.

Poli Swargam Pooja Method

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Related Posts:

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు ! | Amavasya Pooja Significance in Telugu !

All you need to know about “Polala Amavasya”

మౌని అమావాస్య నిజంగా అంత ప్రమాదకరామా ? ఇందులో నిజమెంత ? | Mauni Amavasya in Telugu

పొలాల అమావాస్య నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Polala Amavasya pooja In Telugu

Chukkala Amavasya Puja, Gauri Vratam

ఈరోజు చుక్కల అమావాస్య – గౌరీవ్రతం | Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

ఈరోజు – జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య | Somavathi Amavasya in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here