శారదాపీఠంలో పంచాగ శ్రవణం..ఏపీకి & తెలంగాణకి కాబోయే సీఎంలు ఎవరు? జగన్ & కేసీఆర్ ల జాతకాలు ఏంటి?

0
4251
Horoscope of CM Jagan, KCR & Narendra Modi
Horoscope of CM Jagan, KCR & Narendra Modi in 2023-24

Politics Ugadi 2023 Panchnga Srvanam in Saradhapitam – Horoscope of CM Jagan, KCR & Narendra Modi

1జగన్, కేసీఆర్ & నరేంద్ర మోడీల జాతకం

ముందుగా అందరికి ఉగాది శుభకాంక్షలు. తెలుగు సంవత్సరాది రోజు అందరు చూడాలి అనుకునేది మన జాతకం ఎలా ఉంది? మరియు మన నాయకుల జాతకం ఎలా ఉంది అని.

బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం ఉగాది పండుగ వేడుకలను చేసి పంచాంగ శ్రవణం చేయడం విశాఖపట్నం శ్రీ శారదాపీఠం సంప్రదాయం అని అన్నారు. ఈ ఉగాది వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అయితే శారదా పీఠంలో జరిగిన పంచాగ శ్రావణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు చెప్పారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది ఎవరు? సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక్క ఛాన్స్ ఇస్తారా? తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ దక్కేనా? ఇలాంటి సందేహాలకి ఉగాది సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి నివృత్తి చేశారు.

మొదట రాజ శ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. జ్యోతి ప్రజ్వలనతో శ్రీ శారదా పీఠంలో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. పీఠం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం చేసిన తర్వాత స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు.

Back