దాడిమీ పత్రం / Dadimi Patram in Telugu

0
2204
punica-granatum-leaves-HariOme
దాడిమీ పత్రం / Dadimi Patram

దాడిమీ పత్రం / Dadimi Patram

వటవేనమః దాడిమీ పత్రం సమర్పయామి

దీనిని దానిమ్మ అంటారు. సంస్కృతంలో దీనికి దంతబీజ మణిబీజ, రక్తపుప్ప, నీల పత్రక, వల్కఫల అనేవి పర్యాయ పదాలు. దీని శాస్త్రీయ నామం “Punica granatum.’

ఇది తీపి, పులుపు, కషాయ రసములను కలిగి యుంటుంది. అందమైన పలు వరుసను దానిమ్మ విత్తులతో పోల్చుతారు. అందువలన దంత బీజ అని, విత్తనములు మణులవలె ఉండటం వలన మణిబీజ అని, బీజముల మధ్య సన్నని పొర ఉండుట చేత వల్కఫల అని అంటారు. ఇది ఆకలిని కల్గిస్తుంది. అజీర్ణము, ఛర్ణి (వాంతులు)ని పోగొడుతుంది. దాహము (మంట)ను తగ్గిస్తుంది. హృద్రోగ మునహితము. పాషాణ విషములచే కలిగిన వికారములను తగ్గిస్తుంది.

శక్తి స్వరూపిణి అయిన అంబకు దాడిమీ ఫల నైవేద్యము ప్రీతిపాత్రమైనది. లలితా సహస్రనామాలలో అంబ ‘దాడిమీ కుసుమప్రభ’ అని వర్ణించబడింది. తంత్ర ఉపాసకులు దానిమ్మపల్లతో బీజాక్షరములు యంత్రములు వ్రాయడానికి ఉపయోగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here