పూజలు చేస్తే జాతకం లో దోషాలు పోతాయా ?

0
17799
Young woman offering prayers
Young woman offering prayers

మనకు ప్రదానం గా దైవారాధన రెండు విధములు గా ఉంటాయి

1. ఏదైనా ప్రత్యేకించి కోరి చేసేది పూజ ఒక రకము అంటే కామ్యార్ధము కోరి చేసేది
2. సహజంగా మనస్సు శాంతి కొరకు , కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేసేది.

అయితే ప్రశ్న ప్రకారం పూజలు చేస్తే జాతకం లో దోషాలు పోతాయా అంటే సమాధానం తొలగించుకునే ప్రయత్నంలో భాగం దైవారాధన చేయడం అంటే అది కామ్యార్ధం చేయునది.
కేవలం భగవత్ ప్రాప్తి కోసం చేయు పూజా పునస్కారములు ద్వారా ఆనందాన్ని మోక్షాన్ని పొందుతారు.

పూజలద్వారా మనకు జాతకంలో వుండే దోషాలు పోతాయా అంటే అది మనం చేసే పూజా స్ధాయిని బట్టి వుంటుంది. మార్కండేయుడు శివారాధన ద్వారా జాతకంలో వున్న అతి తక్కువ ఆయుర్దాయమును పెంచుకున్నాడు. అయితే మనం అంతస్ధాయిలో జపం, పూజ వంటివి చేయగలమా? కానీ చేసినస్ధాయికి తగిన ప్రతిఫలం పొందగలము.

ఉదాహరణకి జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు పెరిగే సూచన వున్నది ఆ సమయంలో మనం చేసే పూజా ఫలితం మంచి వైద్యం దొరికిత్వరగా ఉపశమనం పొందే మార్గం చూపడం, వైద్యం ఎంత ఖరీదయినా చేయించుకున్నే ఆర్ధిక సహకారం అందడం, వైద్య సమయంలో మనకు సహకరించే మనుషులు వుండడం, అనారోగ్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే మనోధైర్యం వంటివి మనం పొందగలుగుతాము. ఇవన్నీ దైవారాధన ద్వారా రావాలసినవే. రోగం రావడం మాత్రం ఆగకపోవచ్చు అయితే మార్కండేయుని స్ధాయితో పూజాదులు చేస్తే రోగము రాకుండా తప్పకోగలము అనేది మనకు పూరాణాల ఆధారం.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here