ఈ రోజు పూర్ణిమ

1
1452
 Full Moon day
Pournami Full Moon day

Pournami Full Moon day

మాసముయొక్క సంపూర్ణ శక్తి కలిగిన ఈ రోజున శని పూజ, శివాభిషేకములు చేయుట వల్ల శనిబాధ ఉపశమిస్తుంది.

శివారాధన ఎవరు చేయొచ్చు?

అందరూ శివారాధనకు అర్హులు కారు.అలాగని శివారాధనకు అర్హులు కావాలంటే కావలసింది మతమో, కులగోత్రాలో కాదు. శివారాధన చేయాలంటే ఆ ఆరాధకుడు కూడా శివుడే అయి ఉండాలి. “నా రుద్రో రుద్రమర్చయేత్” అని శాస్త్ర వాక్యం. 

మీరు కూడా శివుడెలా కాగలరు?

శ్లో|| దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః|

     త్యజేదఙ్ఞాన నిర్మాల్యం సోsహంభావేన పూజయేత్||

దేహమే దేవాలయం . ఈ దేహం లోని జీవుడే సనాతన స్వరూపుడైన శివుడనీ, అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించుకొని. తానే భగవంతుడని అర్చించమని అద్వైత వాక్యం చెబుతోంది.

సర్వేశ్వరుడైన ఆ దేవుడే సర్వాత్మకుడు అని భావించాలి. సర్వాత్మకుడు అంటే అన్నింటా ఆత్మ స్వరూపుడై నిలిచి ఉన్న భగవంతుడు. అంతటా నిలిచి ఉన్న ఆ ప్రమాత్మ తనలోనూ ఉన్నాడని గ్రహించి ఆయనను పూజించాలి. ఇలా గ్రహిస్తే భగవంతుడూ మనమూ వేరు కాదు. అప్పుడు మనమే శివుడై శివుడిని ఆర్చిస్తాము.

శని దేవుని షోడశ నామాలు

కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః |
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః ||

అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః ||

షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే ||

వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా “అష్టమ” , “అర్ధాష్టమ” , ” ఏలినాటి శని ” లతో బాధ పడుతున్నవారు. మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము. సంప్రదించు వారు హరి ఓం యాప్ లో వ్యక్తిగత పరిష్కారాల సెక్షన్ లోకి వెళ్ళండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here