గుండె నొప్పి వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.! | Precautions to take During Heart Attack in Telugu

1
20725
10947209_937393929625198_4826967594483022678_n
గుండె నొప్పి వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.! | Precautions to take During Heart Attack in Telugu

గుండె నొప్పి వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.! | Precautions to take During Heart Attack in Telugu 

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవుని జీవితంలో అనేక మార్పులు తెచ్చింది. మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులు అందులో భాగమే.

అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల్లో కూడా ఈ మార్పులు శరవేగంగా వస్తున్నాయి.

ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి రుగ్మతలు అధికం కావడానికి మారుతున్న జీవన శైలి కారణమని వైద్యశాస్త్రం ఘోషిస్తోంది.

ఈ రుగ్మతలు కలిగిన ప్రజానీకానికి గుండెపోటు ఓ ప్రమాదకరమైన సమస్య. గుండెపోటు చాలా ప్రమాదకరమైనదని మనలో చాలా మందికి తెలుసు. గుండెపోటు వచ్చిన వారిలో సగం మంది గుండె నొప్పి వచ్చిన రెండు గంటల్లోనే చనిపోతున్నారంటే, ఈ వ్యాధి ఎంత ప్రమాదమైందో మనం అర్థం చేసుకోవచ్చు.


నొప్పి వచ్చిన గంటలోపు సరైన ప్రాథమిక వైద్యాన్ని పొందగలిగితే గుండెపోటు వల్ల సంభవించే మరణాలను సగానికి తగ్గించవచ్చు. గుండెపోటు వైద్యంలో అత్యంత కీలకమైన ఈ మొదటి గంట సమయాన్ని ‘గోల్డన్‌ అవర్‌ ఆఫ్‌ ది హార్ట్‌ అటాక్‌’ అంటారు.


గోల్డెన్‌ అవర్‌లో ఏం చేయాలి?
గుండె నొప్పి వచ్చిన వ్యక్తి ‘నేనిక బతకన’ని భావిం చడం సహజం. భయపడేకొద్దీ గుండె కొట్టుకునే వేగం పెరిగి, గుండె నొప్పి తీవ్రత ఎక్కువవుతుంది. అందుకే రోగికి ధైర్యం చెప్పాలి. రోగికి సహకారం అందించే వారు కూడా ధైర్యంగా ఉండాలి.


యాస్ప్రిన్‌ (325 మిల్లీ గ్రాముల) మాత్రను వీలైనంత త్వరగా చప్పరిం చాలి. మింగడం కన్నా ఈ మాత్ర చప్పరించడం వల్ల ఈ మాత్ర ప్రభా వాన్ని త్వరగా పొందగలం. సార్బి ట్రేట్‌ (5 మిల్లీగ్రాములు) మాత్రను నాలుక కింద ఉంచుకోవాలి.

యాస్ప్రిన్‌ మాత్రను, సార్బిట్రేట్‌ మాత్రను వీలైనంత త్వరగా తీసుకోగలిగితే గుండెపోటుకు జరిగే అత్యవసర వైద్యంలో సగం వైద్యం పూర్తయినట్లే.
ఈ రెండు మాత్రలూ గుండెకు రక్తప్రసరణ పెంచడంలో ఎంతో ఉప యోగపడతాయి.

గుండె కణజాలం దెబ్బతినకుందడా మనల్ని రక్షిస్తాయి. గుండెపోటు వచ్చిన గంట లోపల ఈ మాత్రలను అందుబాటులోకి తెచ్చుకోవడమనన్నదే పెద్ద సమస్య. గుండెపోటు వచ్చినప్పుడు ఈ మాత్రలను వాడాలని తెలిసిన వారే తక్కువ.

తెలిసినా ఆ సమయంలో గుర్తుండడం చాలా కష్టం. గుర్తున్నా అందుబాటులో లేకపోవడం సర్వ సాధారణం. నొప్పి వచ్చిన సమయంలో ఆ రోగి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో? ఎంత దూరంలో ఉంటాడో? ఊహించడం చాలా కష్టం. గంట లోపల డాక్టరును కలవడం సాధారణంగా సాధ్యం కాదు.


ఎవరిలో సమస్య ఎక్కువ?
గుండెపోటు అవకాశం ఎక్కువగా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులున్న వారిలో ఉంటుంది.

ఈ మాత్రలను వీలైనంత అందుబాటులో ఉంచుకోవాలి. వీరికే కాకుండా 40 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నందున, 40 సంవత్సరాలుపైబడిన ప్రతీ ఒక్కరూ ఈ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

ఈ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడానికి ఎవరికి అనుకూలమైన పద్ధతిని వారు వెతుక్కోవడం మేలు. ఒక్క చోటే ఈ మాత్రలను ఉంచుకొనే కన్నా రెండు, మూడు ప్రాంతాల్లో భద్రపరుచు కోవడం మంచిది.

జేబులో, డబ్బు దాచుకునే మనీ పర్సులో, చేతి సంచిలో, ఏటిఎం కార్డు భద్రపరుచు కునే పెట్టెలో, ఇంటిలో ఒక నికరమైన ప్రాంతంలో, పనిచేసే ఆఫీసులో, ప్రయాణం చేసేటప్పుడు లగేజీ బ్యాగ్‌లో ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వారు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.


గుండెనొప్పి అని తెలుసుకోవడం ఎలా?
మాత్రలైతే అందుబాటులో ఉంచుకోగలం గానీ, ఛాతీలో వచ్చిన ప్రతి నొప్పీ గుండె నొప్పి కాదు కదా! అసలైన గుండె నొప్పిని గుర్తించడమెలా అనే అనుమానం ఇప్పటికే వచ్చి ఉంటుంది.

ఛాతీలో వచ్చిన ప్రతి నొప్పీ గుండె నొప్పి కాదన్నది వాస్తవమే. జీర్ణాశయం, ఆహార వాహిక పొక్కడం, పుండ్లు పడడం లాంటి సమస్యలున్నా ఛాతీలో నొప్పి ఉంటుంది.

దీనినే సాధారణంగా గ్యాస్ట్రిక్‌ సమస్య అంటారు.


గ్యాస్ట్రిక్‌ సమస్య, గుండెపోటు లక్షణాల మధ్య తేడా స్పష్టంగా గుర్తించడం చాలా సందర్భాల్లో డాక్టర్లకు కూడా కష్టమే.

ఛాతీలో వచ్చిన నొప్పిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి ప్రమాదానికి గురైన సందర్భాలు కోకొల్లలు. ఛాతీలో చెప్పడానికి సాధ్యం కాని బాధ అనిపించినా, ఛాతీలో నొప్పి వచ్చి మెదడుకు కానీ, ఎడమ చేతికి కాని పాకినట్లు అనిపించినా, నొప్పితో పాటు ముచ్చెమటలు పట్టినా ఆ నొప్పిని గుండెపోటుగా భావించాలి.


ఛాతీలో తీవ్ర స్థాయిలో వచ్చిన ప్రతి నొప్పినీ గుండెపోటుగా భావించి యాస్ప్రిన్‌ మాత్రను వాడితే లాభమే తప్ప, వచ్చే నష్టమేమీ పెద్దగా ఉండదు.

వచ్చింది ఒకవేల గుండెనొప్పి అయితే మాత్ర వాడడం చాలా బాగా ఉపయోగపడు తుంది. వచ్చింది గనక గ్యాస్ట్రిక్‌ సమస్య గనక అయితే ఛాతీ నొప్పి కొద్దిగా పెరుగు తుంది. పెరిగినా అది పెద్ద సమస్య కాదు.


అయితే, ఈ మాత్రను వాడడం ప్రాథమిక వైద్యమే! యాస్ప్రిన్‌ మాత్రను మింగి వీలైనంత త్వరగా డాక్టరును సంప్రతించాల్సిందే.

యాస్ప్రిన్‌ మాత్ర మింగాం. మనకింకేమీ కాదని అనుకోకూడదు. ఇలా యాస్ప్రిన్‌ మనకు తోడుంటే, గుండెపోటు నుంచి తాత్కాలికంగా రక్షణ పొందగలం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here