ఇల్లు, పొలం ఇస్తా!: నన్ కి చర్చి బిషప్ ఆఫర్

0
1639

రేప్ కేసు వెనక్కి తీసుకుంటే ఇల్లు, పొలం ఇస్తా!: నన్ కి చర్చి బిషప్ ఆఫర్

చర్చి ఫాదర్ల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభువు పేరుతో, ప్రార్థనల పేరుతో కొందరు బిషప్ లు చేస్తున్న అమానుషాలు వెలుగులోకి వస్తున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు ఫాదర్లు రేపిస్టులుగా మారుతున్నారు. అమాయక మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఆ తర్వాత తమ పరపతి, డబ్బు ఉపయోగించి బాధితుల గొంతు నొక్కేస్తున్నారు. కేరళలో ఓ వివాహితపై ఐదుగురు ఫాదర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు కేరళలోని చర్చిలలో ఏం జరుగుతోంది? అని సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఈ ఘటన మరువక ముందే.. ఇప్పుడు మరో బిషప్ చేసిన దారుణం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఓ క్రైస్తవ నన్ పై అత్యాచారానికి పాల్పడ్డ చర్చి ఫాదర్.. కేసు మాఫీ కోసం ఏకంగా మరో చర్చి ఫాదర్ తో ఫోన్ చేయించాడు. కేసును వెనక్కి తీసుకుంటే ఇల్లు, భూమి ఇస్తామనీ ఆఫర్ ఇచ్చాడు. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే ఈ కాల్ రికార్డును బాధితురాలు పోలీసులకు అందించింది. ప్రస్తుతం ఈ ఆడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ బిషప్ ఫ్రాంకో ముల్లకల్ 2014-16 మధ్య కాలంలో తనపై 13 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు(46) తెలిపింది. అత్యాచారం చేయడమే కాకుండా.. బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ తనపైనే ఆయన కేసు పెట్టడాని.. దీంతో తాను పోలీసుల్ని ఆశ్రయించి, రేప్ కేసు పెట్టానని ఆమె వెల్లడించింది.

ఈ నేపథ్యంలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన మరో నన్ కి.. బిషప్ ఫ్రాంకో తరఫున కేరళలోని క్యాథలిక్ చర్చికి చెందిన ఫాదర్ జేమ్స్ ఫోన్ చేశాడు. ఈ కేసును వెనక్కి తీసుకుంటే పెద్ద ఇల్లు, 10 ఎకరాల పొలం, ఆర్థిక సాయం చేస్తామని చెప్పాడు. ఒకవేళ కేసు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కేసు వాపస్ తీసుకునేలా ఆమెను ఒప్పించాలని సూచించాడు.

ఈ ఆడియో క్లిప్ ను బాధితురాలు సోమవారం పోలీసులకు అందించింది. ఈ ఘటనపై నన్ వాంగ్మూలం తీసుకున్నామని, త్వరలోనే కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here